Sunday, December 22, 2024

ఉత్తర అమెరికాపై వింటర్ బాంబు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా ఉత్తరప్రాంతాన్ని అత్యంత భయానక శీతాకాల తుపాన్ కుదిపేసింది. శుక్రవారం నుంచి భారీ హిమపాతంతో కూడిన భారీ తుపాన్ , గడ్డకట్టించే స్థాయి వర్షాలతో జనజీవితం అస్తవ్యవస్థం అయింది. వాతావరణ అసాధారణస్థితిలో దాదాపు రెండువేలకు పైగా విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. రాదార్లపై వాహనాలకు బ్రేక్‌లు పడ్డాయి. పలు ప్రాంతాలలో వాననీరు నేలమీదపడేలోగానే మంచుగా గడ్డకట్టుకుని పోతోంది. తుపాన్ ప్రభావంతో పలు చోట్ల ప్రమాదాలు జరిగినట్లు, పలువురు మృతి చెందినట్లు వార్తాసంస్థలు తెలిపాయి. పలు దారులు మంచుతో కూరుకుపోయ్యాయి. వీటిని తొలిగించేందుకు సహాయక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఇడాహో, విస్కన్‌సిన్‌లలో వాహనాలలో వెళ్లుతున్న ఇద్దరు దుర్మరణం చెందారు.

చికాగో శివార్లలో ఓ వ్యక్తి తీవ్రస్థాయి చలికి తట్టుకోలేక చనిపోయాడు. రెండువేల విమానాల నిలిపివేత, ఏడువేల వరకూ విమానాల జాప్యంతో ప్రయాణాలకు విఘాతం ఏర్పడింది. శనివారం ఉదయం గంటకు 64 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తూ ఉండటంతో , భారీ స్థాయిలో మంచుపడుతూ ఉండటంతో పరిస్థితి దిగజారింది. మిచిగాన్‌లో స్థానికులు విద్యుత్ సరఫరాకు ఆటంకాలతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాదాపు లక్షన్నర మంది వరకూ వణికించే చలిలో విద్యుత్ సరఫరా లేక తల్లడిల్లాల్సి వచ్చింది. డకోటాలో అత్యల్పస్థాయిలో మైనస్ 24 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇది మరింతగా పడిపోతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో వరదల హెచ్చరికలు కూడా వెలువరించారు. దీనితో జనం మరింత అప్రమత్తం కావల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News