న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ అప్రమత్తమైంది. వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడానికి సిబ్బందికి శీతాకాలం సెలవుల్ని రద్దు చేసింది. వెంటనే అందరూ విధుల్లో చేరాలని ఆదేశించింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ దేశ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎయిమ్స్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. కొవిడ్ కారణంగా రెండు మూడు రోజుల వ్యవధిలో ఆస్పత్రిలో 50 మంది బాధితులు చేరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో సోమవారం ఒక్క రోజే ఢిల్లీలో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 6.46 శాతానికి చేరింది. గత ఏడాది మే తరువాత పాజిటివిటీ రేటు ఈ స్థాయికి పెరగడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. ఢిల్లీలో ఈ వారాంతం నాటికి రోజుకు 89 వేల కేసులు నమోదు కావచ్చని అంటున్నారు. జనవరి 15 నాటికి రోజువారీ కేసులు 20 వేల నుంచి 25 వేలకు పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రిలో చేరికలు కూడా పెరుగుతాయని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బందికి శీతాకాలం సెలవులు రద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -