Wednesday, January 22, 2025

అంతటా కాంగ్రెస్ ను తుడిచిపారేయండి: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

రుద్రపూర్: బిజెపి కనుక మూడో సారి అధికారంలోకి వస్తే ‘అగ్గి మీద గుగ్గిలమే’ (conflagration) అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్ కు చెందిన ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ నుంచి ఆయన లోక్ సభ ఎన్నికల  ప్రచారాన్ని మొదలెడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ కు ఏమీ పాలుపోవడంలేదు. అన్ని చోట్ల నుంచి కాంగ్రెస్ ను తుడిచివేయాలని మోడీ అన్నారు.

కాంగ్రెస్ షెహజాదా(రాహుల్ గాంధీ) మరో సారి మోడీ ప్రభుత్వం వస్తే దేశంలో అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. వారు అధికారం కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో అగ్గి వగైరా మాట్లాడుతున్నారని ప్రధాని అన్నారు. వారిని ఇలాగే వదిలేస్తారా? వారిని మీరు శిక్షించరా? వారి పార్టీ దేశాన్ని అస్థిరం వైపుకు, అరాజకం వైపుకు నెట్టాలనుకుంటోందని విమర్శించారు.

ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ఆదివారం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా బిజెపి ఎన్నికల్లో గెలిస్తే మొదట రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. తర్వాత దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తుంది అన్నారు. ఇదిలావుండగా అవినీతికి వ్యతిరేకంగా తమ చర్యలు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ వాగ్దానం చేశారు.  ‘అవినీతిపరులు జైలుకు వెళ్లాలని మీరు కోరుకోరా, అవినీతిపరులు నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. కానీ వారు నన్ను వంచలేరు. ప్రతి అవినీతిపరుడిపై చర్య తీసుకోవడం జరుగుతుంది’ అంటూ మోడీ తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జెఎంఎం నాయకుడు హేమంత్ సోరేన్ వేర్వేరు అవినీతి కేసుల్లో అరెస్టయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖలు చేయడం గమనార్హం. బిజెపిని గెలిపించి, తమని మరింత బలోపేతం చేస్తే దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మలుస్తామని ఆయన తెలిపారు. ‘మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని నెరవేర్చడమే’ అని ఆయన అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News