Saturday, December 21, 2024

విప్రో సిఇఒ డెలాపోర్టె రాజీనామా

- Advertisement -
- Advertisement -

విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) థియరీ డెలాపోర్టె ‘బాహ్య్ల అవకాశాల’ కోసం సంస్థ నుంచి వెంటనే నిష్క్రమిస్తున్నట్లు సంస్థ శనివారం వెల్లడించింది. సంస్థ అమెరికాస్ 1 ప్రాంతానికి సిఇఒగా ఉన్న శ్రీనివాస్ పల్లియా ఆదివారం (7) నుంచి కొత్త సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సంస్థ తెలియజేసింది. ‘విప్రోలో థియరీ నాయకత్వానికి గాను ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన తీసుకువచ్చిన మార్పులు భవిష్యత్తుకు మమ్మల్ని మెరుగైన స్థానంలో నిలిపాయి. మా వ్యవస్థను, నాయకత్వాన్నిపెంచాం, భాగస్వామ్యాలకు ప్రాథమ్యం ఇచ్చాం. మా మొత్తం సామర్థాని మెరుగుపరచుకున్నాం’ అని సంస్థ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. 2020 జూలై 6న గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ కంపెనీ సిఇఒ, ఎండిగా బాధ్యతలు స్వీకరించిన డెలాపోర్టె క్యాప్‌జెమిని గ్రూప్ నుంచి సంస్థలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News