Sunday, January 19, 2025

సగం వేతనమే అందుకున్న విప్రో చైర్మన్

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశంలో మూడో అతిపెద్ద ఐటి సంస్థ విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2023 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి మొత్తం 8,67,669 డాలర్లు పరిహారం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వేతనంతో పోలిస్తే ఇది 50 శాతం తక్కువగా ఉంది. ఈ సమాచారాన్ని విప్రో ఫారం 20-ఎఫ్‌లో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కి దాఖలు చేసింది.

రిషద్ ప్రేమ్‌జీ తక్కువ పరిహారం తీసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు కరోనా మహమ్మారి సమయంలో ఆయన తన పరిహారాన్ని 31 శాతం తగ్గించారు. ఆ తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం 0.68 మిలియన్ డాలర్లు అంటే రూ. 5.62 కోట్ల పరిహారం తీసుకున్నారు. అంతకుముందు 2018-19లో 0.98 మిలియన్ డాలర్లు (రూ. 8.11 కోట్ల) పరిహారం పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News