Monday, December 23, 2024

విప్రో సిగ్నల్ వద్ద టిప్పర్ బీభత్సం… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలిలోని విప్రో కూడలి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ వద్ద టిప్పర్ అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఒకరు దుర్మరణం చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. మృతి చెందిన వ్యక్తి స్విగ్గీలో డెలవరీబాయ్ పని చేస్తున్న నసీర్‌గా గుర్తించారు. అబ్ధుల్ అనే విద్యార్థికి కాలు విరిగిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News