Thursday, January 23, 2025

మగాడినై ఉంటే బాగుండేది: జెంగ్ క్వినెన్ ఆవేదన

- Advertisement -
- Advertisement -

Zheng Qinwen

స్టేడ్ రోలాండ్ గారోస్(పారిస్): తాను పురుషుడినై ఉంటే బాగుండేదని చైనా యువ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్ వాపోయింది. ఆమె కడుపు నొప్పి తట్టుకోలేక ఈ మాటలు అన్నది. ఈ 19 ఏళ్ల చైనీస్ టీనేజర్ ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే నాలుగో రౌండ్‌కు చేరుకుంది. దాంతో ప్రపంచ నంబర్ టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌తో తలపడే అవకాశం దక్కించుకుంది. కానీ సోమవారం ఆడవాళ్లకు సహజమైన రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి కారణంగా విలవిల్లాడింది. అయినప్పటికీ బరిలోకి దిగింది. ఈ క్రమంలో 6-7(5), 6—0, 6-2 తేడాతో స్వియాటెక్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన ఆమె విలేకరులతో మాట్లాడుతూ “ఎంత కష్టమైనా మ్యాచ్ కంప్లీట్ చేయడానికి ఇష్టపడతాను. నా స్వభావానికి విరుద్ధంగా వెళ్లను. అయితే ఈ రోజు కోర్టులో ఉన్న సమయంలో నేను పురుషుడినైతే బాగుండేదనిపించింది. ఆ క్షణంలో నిజంగా నేను మగాడిని అయి ఉంటే…ఈ రుతుస్రావ బాధ తప్పేది. పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదేమో” అని వ్యాఖ్యానించింది. అయితే వరల్డ్ నంబర్ 1తో పోటీపడినందుకు సంతోషంగా ఉందని ఈ 74వ ర్యాంకర్ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News