Monday, December 23, 2024

మహారాష్ట్ర సిఎంగా బ్రాహ్మణుడిని చూడాలి

- Advertisement -
- Advertisement -

Wish To See A Brahmin As Maharashtra CM

కేంద్ర మంత్రి దాన్వే అకాంక్ష

ఔరంగాబాద్: బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నదే తన అభీష్టమని కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే అన్నారు. పరశురామ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సంఘానికి చెందిన సభ్యులు మంగళవారం రాత్రి మహారాష్ట్రలోని జాల్నాలో నిర్వహించిన ఒక సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. స్థానిక సంస్థలలో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ కొందరు సభ్యులు లెవనెత్తిన డిమాండుపై దాన్వే స్పందిస్తూ బ్రాహ్మణులను కార్పొరేటర్లుగా లేక స్థానిక సంస్థల అధిపతులుగా చూడాలని తాను కోరుకోవడం లేదని, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే చూడాలని తాను భావిస్తున్నానని అన్నారు.

ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేశానని, ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని బిజెపి సీనియర్ నాయకుడైన దాన్వే చెప్పారు. రాజకీయాలలో కులతత్వం బాగా పెరిగిపోయిందని, దాన్ని ఎవరూ విస్మరించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే..కులాలను సమైక్యంగా ఉంచగల నాయకుని అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. దాన్వే వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గురువారం స్పందిస్తూ..రాష్ట్ర అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేల(మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ సీట్లు 288) మద్దతు ఉంటే ఏ కులానికి చెందిన సభ్యుడైనా కాని ట్రాన్స్‌జెండర్‌తోసహా ఎవ్వరైనా ముఖ్యమంత్రి కావచ్చని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News