Wednesday, January 22, 2025

గంగూలీకి శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : భారత క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 51వ వసంతంలోకి అడుగిడాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గంగూలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు దాదాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జైషా, టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వసీం జాఫర్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు గంగూలీకి విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. మరోవైపు తన జన్మదినాన్ని పురస్కరించుకుని గంగూలీ కూడా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టా డు. మాస్టర్ క్లాస్ పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చి నాయకత్వ లక్షణాలపై ఆన్‌లైన్ కోర్సును నిర్వహించాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా ప్రకటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News