Sunday, December 22, 2024

దెయ్యం… మెడపై తొక్కి మహిళను చంపిన మాంత్రికుడు

- Advertisement -
- Advertisement -

లక్నో: దెయ్యం వదిలిస్తానని చెప్పి ఓ మాంత్రికుడు మహిళ మెడను తొక్కి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇటావా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పత్వారియా ప్రాంతంలో ప్రియా సక్కెనా తన భర్తతో గొడవలు జరగడంతో ఇద్దరు వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. దీంతో భర్త దూరంగా ఉండడంతో ప్రియాకు మానసికంగా కుంగిపోవడంతో మాంత్రికుడిని కలిసింది. ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మాంత్రికుడు చెప్పాడు. ప్రియం పుట్టింట్లో హోమం నిర్వహించిన అనంతరం ఆమె మెడపై మాంత్రికుడు కాలు పెట్టాడు.

మెడపై కాలుతో తొక్కడంతో విలవిలలాడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఏడు రోజుల్లో ఆమె అనారోగ్య సమస్యలు వదిలివెళ్లిపోతాయని  మాంత్రికుడు చెప్పాడు. ఒక రోజు తరువాత కూడా ఆమె స్పృహలోకి రాకపోవడంతో మళ్లీ మాంత్రికుడిని కుటుంబ సభ్యులు పిలిచారు. కాసేపట్లో స్పృహ వస్తుందని చెప్పి అక్కడి నుంచి మాంత్రికుడు పారిపోయాడు. ఆమె చనిపోయిందని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తప్పించుకున్న మాంత్రికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News