Monday, December 23, 2024

మెరుగైన విద్యుత్ సరఫరాతో విద్యుత్ డిమాండ్ 15623 మెగావాట్లకు పెరిగింది

- Advertisement -
- Advertisement -

ఎన్‌పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్:  వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించండం వలన రాష్ట్రము లో 15623 మెగావాట్ల విద్యుత్ వినియోగం రికార్డు నమోదయందని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగం 303.6 మిలియన్ యూనిట్ల మైలు రాయిని చేరుకుందని అన్నారు . ఇదంతా కేవలం అంతరాయాలు లేకుండా మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రజలకు అందించడం వలెనే సాధ్యమైందని తెలిపారు.ఆహర్నిశలు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సరఫరా అందించడానికి విద్యుత్ అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు , క్రియాశీలకంగా పని చేస్తున్నారని , ఎన్‌పిడిసిఎల్ పరిధిలో గత సంవత్సరం (2022- 23) డిసెంబర్ జనవరి , ఫిబ్రవరి తో పోల్చుకుంటే 33 కెవి బ్రేక్ డౌన్స్ 506 ఉండగా ఈ ఏడాది ( 2023- -24) డిసెంబర్ జనవరి , ఫిబ్రవరి లో కేవలం 313 మాత్రమే అయ్యాయని, 38 శాతం తగ్గిందని , అలాగే 33 కె వి ట్రిప్పింగ్స్ 14 శాతం తగ్గిందని , ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు 25 శాతం తగ్గిందని అన్నారు.

పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు వైఫల్యాలు కూడా 23 శాతం తగ్గడం గమనార్హమన్నారు.మొత్తంగ గణనీయంగా 33 బ్రేక్ డౌన్స్, 33 కె వి ట్రిప్పింగ్స్, ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు తగ్గడంతో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ తార స్థాయికి చేరుకుందని అన్నారు . ప్రతి ఒక్కరు ప్రణాళికతో , నిబ్బద్దతతో లైన్ ల ( పిఎంఐ) నిర్వహణ చేపడుతూ, జంపర్లను సరిచేస్తూ , వంగిన పోల్ లను సరిచేస్తూ , 200 ఫీడర్ లపై కెపాసిటర్ బ్యాంకు లను పెట్టడం , 530 ఫీడర్లలో పవర్ ఫాక్టర్ ను నిర్వహించడం వలన లోవోల్టేజి సమస్యలు రాకుండా దోహద పడిందని అన్నారు . ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు జరగకుండా ప్రతి రోజు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ద్వారా అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించడం సాధ్యమైనదని అన్నారు . విద్యుత్ శాఖ నిబ్బద్దతతో పనిచేస్తూ ఉంటె కొందరు కావాలని దుష్ప్రచారం చేయడం బాధాకరమని, అది సరైనది కాదు అని అన్నారు . మా నిరంతర సరఫరా ఫలితాలే రాష్ట్రము లో 15623 మెగావాట్ల చేరుకోవడం ఇందుకు నిదర్శనం అని తెలిపారు . నిరంతరాయంగా వినియోగదార్లకు విద్యుత్ సరఫరా అందించడానికి ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై ఉన్నారని , వారి కష్టానికి రుజువు 15623 మెగావాట్ల డిమాండ్ ప్రతిబింబిస్తున్నదని అన్నారు . రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు . వేసవిలో కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు . విద్యుత్ శాఖ మరింత నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రతి ఒక్కరు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News