గీతం అధ్యాపకులతో ట్రాయ్ చైర్మన్ డాక్టర్ పిడి వాఘేలా
హైదరాబాద్ : ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత వల్ల మనం మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని, అది కొత్త ఉత్పత్తులతో రావడమే గాక అప్పటికే ఆ రంగంలో ఉన్నవారిని కలవరపెట్టడం ఖాయమని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చెర్మన్ డాక్టర్ పీడీ వాఘేలా అన్నారు. ట్రాయ్ కార్యదర్శి వి.రఘునందన్‌తో కలిసి గీతం, హైదరాబాద్ అధ్యాపకులతో శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం పరిశోధనపై దృష్టి పెట్టకపోతే, అంతర్జాతీయ విలువ మార్పు వ్యవస్థలో ఇమడలేమని, ఈ వ్యవస్థలో భారత స్థానం అంత బలంగా లేదన్నారు. కమ్యూనికేషన్, ప్రసారాలలో ప్రాథమిక పరిశోధనలో మనం వెనుకబడ్డా, ఆచరణాత్మక పరిశోధనలో మాత్రం బలంగా ఉన్నట్టు చెప్పారు.
ఏఐలో సమగ్ర పర్యావరణ వ్యవస్థను ప్రతిపాదించిన ప్రపంచంలోని కొన్ని దేశాలలో మనమూ ఒకరమని చెప్పారు. ఇది విద్య, ఆరోగ్య రంగాలలో సహాయపడుతోందని, అపారమైన ప్రయోజనాలను కలిగి ఉందన్నారు. మనదేశం ఏఐ, ఆగ్మెంట్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) రోబోటిక్స్, యంత్రం నుంచి యంత్రంలోకి (ఎంఎల్) ప్రవేశించడం వంటి రంగాలన్నింటిలోకి భారత్ ప్రవేశిస్తోందని చెప్పారు. ఈ సాంకేతికం వల్ల కొన్ని ప్రతికూలతలున్నా, వాటిని అధిగమించి సానుకూలతతో సమతుల్యం చేయడానికి యత్నిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికాం రంగం మనదని, తాము డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తొమ్మిది సమాంతర వ్యవస్థలైన కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు. మనదేశం శిజీ, 5జీ, 6జీ సాంకేతికలను కూడా అభివృద్ధి చేసి ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉండి, పలు దేశాల ఆదరాభిమానంను చూరగొంటోందని తెలిపారు. జీ సాంకేతిక వల్ల చిన్న విక్రేతలు కూడా స్కాన్ ద్వారా సగదు రహిత లావేదేవీలు చేసే వీలు కల్గిందన్నారు. అయితే ఇందులో కొన్ని లోటుపాట్లు లేకపోలేదని, చిన్న పాటి తప్పిదానికే మన ఖాతాలలోని నగదు కొల్లగొట్టే వీలుందని, దానిని సరిగా అరికట్టపోతే ఈ డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలంతా మొగ్గుచూపరని ఆయన హెచ్చరించారు. గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి, రెసిడెంట్ డెరైక్టర్ డివివిఎస్‌ఆర్ వర్మ తదితరులు అతిథులను స్వాగతించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ నీకే శ్రీధర్ విండ్ కర్నెన్ ప్రాజెక్టు పరిశోధన, దాని పురోగతి గురించి వివరించారు. ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ సీఈచో, మేనేజింగ్ డెరెక్టర్ సూర్యప్రకాశ్ గజ్జలు కూడా ట్రాయ్ బృందంతో పాటు వచ్చారు.