Monday, December 23, 2024

సోషల్ మీడియా లింకులతో రూ. 400 కోట్లు టోకరా

- Advertisement -
- Advertisement -

ఆపై విదేశాలకు బదిలీ…కేటుగాడి పట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్ : సోషల్ మీడియాలో లింకులతో ఏకంగా రూ.400 కోట్లు కొట్టేశాడో కేటుగాడు. కొట్టేసిన రూ. 400 కోట్లను విదేశాలకు తరలించాడు. సైబర్ మోసగాడు రోనాల్ భరత్ కాకడేను ముంబైలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి రోజుకు లక్షల్లో సైబర్ చీటర్స్ కాజేస్తున్నారు. దేశంలో వున్న అనేక మంది అకౌంట్ల వివరాలు సేకరించిన నిందితుడు వందల సంఖ్యలో ఏజెంట్ల ద్వారా నకిలీ ఖాతాలు క్రియేట్ చేయించాడు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బును నిందితుడు అకౌంట్లకు బదిలీ చేయించాడు. ఈ ఖాతాల నుంచి చైనా, తైవాన్‌లలో వున్న వారికి బదిలీ చేశారు. కోట్ల రూపాయలను బిట్‌కాయిన్ రూపంలో , నకిలీ ఖాతాల ద్వారా బదిలీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక బాధితుడి ఫిర్యాదుతో ఘరానా మోసం వెలుగుచూసింది. ముంబైలో రోనాక్ భరత్‌ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇతని మోసాలపై 50కి పైగా కేసులు నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News