Sunday, December 22, 2024

మంత్రి హరీశ్‌రావు సహకారంతో.. సిద్దిపేటకు దీటుగా పటాన్‌చెరు అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

రామచంద్రపురం: రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహాయ సహకారాలతో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని సిద్దిపేటకు దీటుగా అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటైన కొల్లూరు పోలీస్‌స్టేషన్‌ను మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ కేటాయింపు సమస్యను మంత్రి హరీశ్‌రావు సహకారంతో పరిష్కరించుకొని ఆరు ఎకరాల విలువైన భూమిని తెల్లాపూర్ మున్సిపాలిటీకి అందించడం జరిగిందని తెలిపారు.

కథ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మల్లికార్జున స్వామి, బీరప్ప, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు భూమి కేటాయించడంతోపాటు, దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజలకు మెరుగైన భద్రత అందించాలన్న సమన్నత లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు సహకారంతో కొల్లూరుకు నూతన పోలీస్‌స్టేషన్ మంజూరు చేయించుకొని నేడు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అతి త్వరలో శాశ్వత భవన నిర్మాణానికి భూమిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ ప నులకు అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

ఉస్మాన్ నగర్ పరిధిలో ఐటీ పరిశ్రమల కోసం ఇప్పటికే భూమిని సేకరించడం జరిగిందని, త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు వివిధ శాఖల అధికారులు, బిఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News