Friday, December 20, 2024

సీఎం కేసీఆర్ సంకల్పంతో బీసీ కులవృత్తులకు చేయూత

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం పథకం ఈ నెల లబ్దిదారులకు అందించేందుకు సర్వం సిద్దం చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయ పథకం అంశంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరాయ ప్రక్రియగా బీసీలకు ఆర్థిక సాయం కొనసాగిస్తామని, ఈ నెల 15వ తేదీన క్షేత్రస్థాయి పరిశీలన పూర్తైన దాదాపు 300 మంది లబ్దిదారులతో ప్రతి నియోజకవర్గంఓలను పథకం గ్రౌండింగ్ కొనసాగుతుందన్నారు.

స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేసే ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం పాల్గొంటారని, బీసీ కులవృత్తుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ జిల్లా స్థాయి యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం 5,28,000 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జిల్లా యంత్రాంగంతో వేగవంతంగా కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, అన్ని జిల్లాల కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొనగా జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్‌రావు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News