- మెదక్ కలెక్టర్ రాజర్షి షా
టేక్మాల్: పల్లె ప్రగతి ద్వారా నేడు గ్రామాల స్వరూపాలే మారిపోయాయని, పచ్చదనం-పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్రవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రువారం మండలం ఎల్లుపేట గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మండల ప్రత్యేకాధికారి జెంలా నా యక్‌తో కలిసి ర్యాలీగా బయలుదేరి పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని, పల్లెప్రకృతి వనాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామంలో ఏఏ కార్యక్రమాలు చేశారో తెలుసా అని వాకబు చేశారు. పల్లెలు ప్రగతికి చిహ్నాలని, పచ్చదనం పరిశుభ్రత ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తలంపుతో సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి ప్రగి గ్రామపంచాయతీకి ప్రతి నెల ఆర్థిక సంఘం నిధులు అందజేస్తుండటంతో పాటు డంప్‌యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠదామా లు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారన్నారు.
ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, డోజర్ వంటివి అందించి పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా చేశారని, హరితహారం కింద రోడ్డుకిరువైపులా పబ్లిక్‌సంస్థల లో విరివిగా మొక్కలు పెట్టి పచ్చదనానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు పట్టణాలకు వలస వెళ్లి న వారు నేడు పల్లెల వైపు చూస్తున్నారని ఇదంతా పల్లెప్రగతి ద్వారా సాధ్యమైందని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయిలు జెండా ఎగరవేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాకముందు,తెలంగాణ వచ్చాక ఈ 9 యేళ్లలో గ్రామం లో వివిధ పథకాల ద్వారా సాదించిన ప్రగతి, అమలు జరుగుతున్న కార్యక్రమాలు, వచ్చిన నిధులు, లబ్దిపొందిన వివరాల ప్రగతినివేదికను చదివి వినిపించారు.
నాడు-నేడు ప్లెక్సీల ఏర్పాటు ద్వారా అభివృద్ధిని స్పష్టంగా చూపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని 469 గ్రామపంచాయతీలలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని ని ర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రా మాల్లో పల్లె ప్రగతి ద్వారా గుణాత్మక మార్పు తీసుకువచ్చిందని అన్ని కార్యక్రమాలు ఇక్కడ కూడా అమలవుతున్నాయని అన్నారు. కెసిఆర్ కిట్, ఆసరా పించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు వంటి ఎన్నో పథకాల ద్వారా గ్రామవాసులు లబ్దిపొందారని, త్వరలో ఆగిపోయిన మరికొందరికి ఆసరా పింఛన్లు అందించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇటీవల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి ఆందోల్ నియోజకవర్గంలో మునిపల్లి, చల్మెడలో సంగమేశ్వర ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారని, తద్వారా చెరువులు నింపుకోవడం ద్వారా సాగు ఆయకట్టు పెరిగి ఈ ప్రాంతం సస్యశ్యామలవుతుందని అన్నారు. 21 రోఉలపాటు పండగల ని ర్వహిస్తున్న ఈ దశాబ్ది ఉత్సవాలు ఇప్పటివరకు విజయవంతంగా నిర్వహించబడ్డాయని, ఇకముందు నిర్వహించే కార్యక్రమాలలో ఇదే స్పూర్తి కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జెంలా నాయక్, ఎంపిపి స్వప్న, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.