Thursday, January 23, 2025

ఐ,కె రెడ్డి కృషితోనే … నిర్మల్ అందాల కోవేల

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : మారుమూల నియోజకవర్గంగా ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని రాష్ట్ర అటవీ , పర్యావరణ, న్యాయ,దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సారథ్యంలో నిర్మల్ జిల్లాగా మార్చి కనివిని ఎరుగని రీతిలో నిర్మల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గుంతల మయంగా ఉన్నా రోడ్లను అద్దాంగా మెరిసే రహదారులుగా తీర్చిద్దారు. అలాగే రహదారి మధ్యలో చూపర్లను ఆకట్టుకునే విధంగా రోడ్డు వాటర్ ఫ్లాంటేషన్‌తో పాటు రకరకాలుగా బొమ్మలతో , చక్కటి విద్యుత్ ఆలంకరణతో పులకరించిపోతుంది. అదే విధంగా గతంలో రాజులు పాలించిన నిర్మల్ కోటాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆ పురాతన కట్టాలడాను అద్భుతవంగా అభివృద్ధ్ది చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిద్దిదారు. నిర్మల్ పట్టణంలోని శ్యామ్‌ఘాడ్ కోటేనే దీనికి నిదర్శనంగా ఉంది.

ఆ పురాతన కోటలకు రంగురంగుల విద్యుత్ దీపాలను ఆలంకరణ చేసి పర్యాటక కేంద్రంగా మార్చారు. నిర్మల్ పట్టణంలోని శ్రీ గండి రామన్న ఆలయాన్ని ఎంతో అభివృద్ధ్దితో పాటు ఆలయ ఆవరణలోనే కూతవేటు దూరంలో శ్రీ గండి రామన్న హరితవనాన్ని ఏర్పాటు చేసి పర్యాటకు లను ఉత్సహాపరుస్తున్నారు. నిర్మల్‌లో మొదటి సారీ పార్క్ ఏర్పాటు కావడంతో నిర్మల్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టు పక్కల ప్రజలు సైతం సెలవుదినాల్లో ఆ పార్క్‌లో సేదతీరుస్తూ చిన్నారులతో సందడి చేస్తున్నారు. అలాగే వివాహ శుభ కార్యక్రమాలకు, జన్మదిన వేడుకలకు అక్కడ ఫోట్‌షూట్ నిర్వహిస్తు సందడి చేస్తున్నారు.

నిర్మల్ ఒడిబొడ్డున భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ భక్తిని చాటారు. హైదరాబాద్ , నిజామాబాద్ దూరప్రాంతాలకు వెళ్లకుండా ప్రతీది అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర సర్కార్ నిర్మల్ జిల్లాను అభివృద్ధ్ది దిశగా ముందుకు తీసుళ్తోంది. ఇటీవల కొన్ని రూపాయిలతో అన్ని హంగులతో కూడిన నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్న విషయం అందరికి విథితమే కాగా అభివృద్ధి చెందుతున్న నిర్మల్ పట్టణంతో పాటు నిర్మల్ జిల్లాను అభివృద్ధ్ది చేయాలనే గొప్ప ఆలోచనలో సీఎం కేసీఆర్ సైతం వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషితోనే ఆయన పేరు జిల్లాలో చిరకాలం నిలిచిపోయే విధంగా అనేక దేవాలయాలను నిర్మిస్తూ, నిర్మల్‌ను అభివృద్ది దశలో ముందుకు తీసుకెళ్తున్నారు. చేసిన పనులే గుర్తింపు ప్రతీ అభివృద్ధ్ది పనులు చేస్తూ నిర్మల్ పట్టణాన్ని దిన దిన అభివృద్ది వైపు అడుగులు పడడం రాష్ట్ర సర్కార్ గొప్పతనమేనని నిర్మల్ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News