Tuesday, November 5, 2024

హరితహారం అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది

- Advertisement -
- Advertisement -

మక్తల్ : తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఇటీవల మక్త ల్ మున్సిపాలిటీకి అవార్డు రావడంతో తమపై బాధ్యత మరింతగా పెరిగిందని మక్తల్ మున్సిప ల్ కమిషనర్ మల్లిఖా ర్జున స్వామి అన్నారు. హై దరాబాద్‌లో ఈ నెల 19న జరిగిన ప్రత్యేక కా ర్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావనితో కలిసి అవార్డును అందుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో యా దాద్రి మోడల్ పారెస్టు, ట్రీ పార్క్, రెండు బృహత్ పట్టణ ప్రకృతి వనాలు, జాతీయ రహదారి మధ్యలో మీడియన్ ఫ్లాంటేషన్, అవెన్యూ ఫ్లాంటేషన్‌లను ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందించామన్నారు. భవిష్యత్తులోమరింత బాధ్యతగా పనిచేసి మక్తల్‌పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News