Thursday, January 23, 2025

భీం స్పూర్తితోనే పోడు భూముల పట్టాలు

- Advertisement -
- Advertisement -

వాంకిడి: కుమ్రంభీం స్పూర్తితోనే గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఅర్ పోడు భూముల పట్టాలు పంపిణి చేపట్టినట్లు జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి అమె గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలను పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తోమ్మిదేళ్లలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసిఅర్‌కే దక్కిందని అన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం సేవలు అందించడానికి నూతన మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.

పోడు భూములకు పట్టాలు అందించడంతో గిరిజన రైతులు ప్రభుత్వ పథకాలకు చేరువయ్యారని అన్నారు. గత 50 ఏళ్లలో పరిష్కారం కాని పోడు భూముల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కారించిందని అన్నారు. మండలంలో 1035 మందికి పోడు భూముల పట్టాలు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అజయ్‌కుమార్, పిఎఎంసి చైర్మన్ పెంటు, సర్పంచ్ బండే తుకారాం, ఎంపిడిఓ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఓ మిలింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News