కాచిగూడ : ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి ద్వారా దేశంలో స్వేచ్ఛా, స్వాతంత్రాలు నశించాయని ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యాసభ ఎంపి డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం బిజెపి నగర కార్యాలయ ంలో నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుపాలైన వారిని సన్మానించి, మాట్లాడారు. ఎమర్జేన్సీ ఎంతో మంది జీవితాలను నాశనం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మె ల్యే చింతల రామచంద్రారెడ్డి, హై దరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షు లు డా. ఎన్.గౌతమ్ రావులు మాట్లాడుతూ..ఎమర్జేన్నీలో ప్రజలు అనేక భయంకరమైన పరిస్థితులు అనుభవించారని ఆయన పేర్కొన్నారు.
నాటి ప్రధానమం త్రి ఇందిరాగాంధీ విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమెర్జెన్సీ) భారతీయ ప్రజా స్వామ్యానికి చీక టి రోజని ఆరోపించారు. కా ర్యక్రమంలో గురజరాజ్ ఎంపి భారతీభేన్ షియాల్, గద్వాల్ జిల్లా ఇంచార్జీ వెంకట్‌రెడ్డి, నా గూ రావు నామాజీ, సూర్యప్రకాష్‌సింగ్, కార్పొరేటర్లు అమృత, ఉమరమే ష్ యాదవ్, అనంతలక్ష్మి, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్య దర్శి కేశబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.