Friday, November 22, 2024

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అనుమతులు రద్దు చేయాలి

- Advertisement -
- Advertisement -
Withdraw permissions given to Amazon And Flipkart
ఈ సంస్థల కార్యకలాపాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి
స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్

న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం చేయడానికి ఇకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిన్‌కార్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాని, ఎందుకంటే ఈ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. ఈ నెల 26న గ్వాలియర్‌లో జరిగిన స్వదేశీ జాగరణ్ మంచ్ 15వ జాతీయ సదస్సులో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.అంతేకాదు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వాల్‌మార్ట్,ఇతర మల్టీ నేషనల్ ఇకామర్స్ కంపెనీలు విదేశీ ప్రత్యక్ష పన్నుల(ఎఫ్‌డిఐ) నిబంధనలు ఉల్లంఘించి దేశంలో పచ్చిగా వ్యాపారలు చేస్తున్నాయని, అందువల్ల ఈ కంపెనీఆల కార్యకలాపాలపై సిబిఐ దర్యాప్తును ఆదేశించాలని కూడా ఆ తీర్మానంలో డిమాండ్ చేశారు.

తన ఇకామర్స్ కార్యకలాపాలకు తోడు అమెజాన్ దేశంలోని చిన్న, పెద్ద రిటైల్ వ్యాపారాలను స్వాధీనం చేసుకొంటోందని, షాపర్స్ స్టాప్, మోర్ రిటైల్ చైన్‌లలోఆ సంస్థ పెట్టుబడులు పెట్టడం ఈ దిశగా తీసుకున్న చర్యలేనని కూడా స్వదేశీ జాగరణ్ మంచ్ ఆ తీర్మానంలో ఆరోపించింది.2017 18,2019 20 సంవత్సరాల్లో అంటే మూడేళ్ల కాలంలో అమెజాన్ భారత్‌లో లీగల్, ప్రొఫెషనల్ ఫీజుల కింద రూ.9,788 కోట్లు ఖర్చు చేసిందని, దేశంలో అధికారులకు లంచం ఇచ్చేందుకు ఈ నిధులను ఈ ఖాతాలగుండా మళ్లించినట్లు ఆ సంస్థ అంతర్గత వర్గాలు బైటపెట్టాయని ఆ సంస్థ పేర్కొంది. అలాంటి ఇకామర్స్ సంస్థలు పొందిన లైసెన్సులు, అనుమతులన్నీ కూడా అక్రమ మార్గాలను ఉపయోగించి పొందినవేనని దీన్ని బట్టి రుజువవుతోందని పేర్కొంది. అందువల్ల తక్షణమే ఆ సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, వాటి కార్యకలాపాలన్నీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నామని స్వదేశీ జాగరణ్ మంచ్ ఆ తీర్మానంలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News