Thursday, January 16, 2025

విఐపిలకు ఎన్‌ఎస్‌జి కమాండోల భద్రత ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

విఐపి భద్రతా విధుల నుంచి ఎన్‌ఎస్‌జి కమాండోలను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌ఎస్‌జి కమాండోల స్థానంలో సిఆర్‌పిఎఫ్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వచ్చే నెల లోగా ఈ బాధ్యతల మార్పిడి పూర్తి కావాలని కేంద్రం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలే పార్లమెంట్ భద్రతా బాధ్యతల నుంచి ఉపసంహరించిన ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని సిఆర్‌పిఎఫ్ విఐపి విభాగానికి కేంద్ర హోం శాఖ జతచేసిందని వారు చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్, బిజెపి నాయకుడు, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాకు విఐపి జెడ్ ప్లస్ క్యాటగిరి కింద ఎన్‌ఎస్‌జికి చెందిన బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత లభిస్తోంది. ఇక నుంచి ఈ విఐపిలకు సిఆర్‌పిఎఫ్ ఆధ్వర్యంలో భద్రత కల్పిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News