Friday, November 22, 2024

5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ !

- Advertisement -
- Advertisement -

Ola EV charging
బెంగళూరు:ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవి) కానాలనుకునే వారికి శుభవార్త. బ్యాటరీ ఛార్జింగ్ టైమ్‌కు అతి త్వరలో చెక్ పెట్టబోతున్నట్లు తెలిపారు ఓలా సిఇఒ భవీష్ అగర్వాల్. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం చూపించే పనిపడ్డారు భవీష్ అగర్వాల్. ఎలక్ట్రిక్ వెహికిల్స్ బ్యాటరీలు, ఛార్జింగ్ టెక్నాలజీలో అద్భుతమైన ప్రగతి సాధించిన స్టోర్ డాట్‌తో వ్యూహాత్మక భాగస్వామి కాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. 2 వాట్స్, 4 వాట్స్‌కి సంబంధించిన తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రం నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు చెందిన స్టోర్‌డాట్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని రూపొందించింది. స్టోర్ డాట్ సంస్థ 5 నిమిషాల్లోనే ఒక కారు బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 100 మైళ్లు (160 కిమీ.) కారులో ప్రయాణం చేయవచ్చు. ఇదిలావుండగా స్టోర్‌డాట్‌కి చెందిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఓలా సంస్థ తమ స్కూటర్లకు ఉపయోగించనుంది. 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News