Monday, December 23, 2024

నీరు లేకుంటే జీవనమే ప్రశ్నార్థకం

- Advertisement -
- Advertisement -
  • గత 70 ఏళ్లుగా తీరని నీటి సమస్యను మిషన్ భగీరథతో శాశ్వతంగా పరిష్కరించిన ఘనత కేసిఆర్‌దే
  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి

పరిగి: నీరు లేకుంటే జీవనమే ప్రశ్నార్థకమని, గత 70 ఏళ్లుగా తీరని నీటి సమస్యను మిషన్ భగీరథ పథకంతో శాశ్వతంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పరిష్కరించారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని జాఫర్‌పల్లి, రాఘవాపూర్ శివారులో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ఫ్లాంట్‌లో మంచి నీళ్ల పండుగను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు.

ప్లాంట్‌లో జిల్లా కలెక్టర్ సి.సిరాయణరెడ్డి, జిల్లాలోని ఆయా మండలాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, నాయకులు సందర్శించి నీటిని శుద్ది చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మాడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో త్రాగు నీటి కోసం బోరు బావుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడ్డామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దీన్ని గమనించి ప్రతి గ్రామంలో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా శుద్ది చేసిన త్రాగు నీటిని అందించడం జరిగిందన్నారు.

వర్షాకాలంలో నీళ్లు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారని, వేసవితో మహిళలు బిందెడు నీళ్ల కోసంఎన్నో అవస్థలు పడేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. కేసిఆర్ కృషి ఫలితంగా ఎంతో దూరంగా ఉన్న గోదావరి, కృష్ణా జలాలను రప్పించి, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్చమైనా త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్ది చేసిన జలాలను ప్రతి రోజు సరఫరా చేయడం చూస్తున్నామని గుర్తు చేశారు. నీటి సరఫర ఉన్నప్పుడు మిషన్ బఘీరథ ఇంట్రా, గ్రిడ్ ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని చెప్పారు.

అనంతరం వికారాబాద్ జల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ జీవకోటికి ముఖ్య ఆధారం నీరని, తిండి లేకుండా ఉండోచ్చు కానీ నీరు లేకుండా ఉండలేమని అన్నారు. ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వవందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తెచ్చి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో శుద్ది చేసి ప్రజలకు నాణ్యమైనా మంచి నీటిని అందిస్తుందని తెలిపారు. జిల్లాలోని 20 మండలాల్లో 990 ఆవాసలకు ప్రతి రోజు నిరంతరంగా మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతుందన్నారు. గతంలో వేసవికాలంలో గ్రామాలలో త్రాగు నీటి సమస్య అధికంగా ఉండేదని వాటి పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎంతో ఇబ్బంది పడేవారని, గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించే వారమని చెప్పారు. చాలా గ్రామాలలో ఆర్‌ఓ వాటర్ బాటీళ్లను వినయోగిస్తున్నారని వీటిలో మినరల్స్ శాతం తక్కువగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులతో పాటు జీర్ణ వ్యవస్థపై ప్రభావం ఉంటుందని అన్నారు.

నయా పైసా ఖర్చు లేకుండా ఇంటి ముందుకు వచ్చే నీటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ అంజనేయులు, డిపిఓ తరుణ్‌కుమార్, ఎంపిపి కరణం అరవింద్‌రావు, జడ్‌పిటిసి హారిప్రియా ప్రవీణ్‌రెడ్డి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసన్, సర్పంచ్‌లు అనిత యాదయ్య, నల్క జగన్, జంగయ్య, రైతు సమితి మండల కోఆర్డినేటర్ రాజేందర్, డిఈ చక్రధర్‌రెడ్డి, పరిగి ఎంపిడిఓ శేషగిరిశర్మ, కులకచర్ల ఎంపిపి సత్తమ్మ, జడ్‌పిటిసి రాందాస్, ఎంపిడిఓలు జయరాం, ఉమాదేవి, ఏపిఓలు, ఏపిఎంలు మహిళలు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News