Thursday, January 23, 2025

లఖింపూర్ హింసాకాండ కేసు.. సాక్షి దిల్‌బాగ్ సింగ్‌పై కాల్పులు

- Advertisement -
- Advertisement -

Witness Dilbag Singh shot dead

లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించిన కేసులో ముఖ్యసాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడైన దిల్‌బాగ్ సింగ్‌పై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దిల్‌బాగ్ సింగ్ కారులో వెళ్తున్న సమయంలో బైకపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఆ తరువాత అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. లఖింపూర్ నుంచి గోలాకు వెళ్తున్న సమయంలో రాత్రి 10 గంటల సమయంలో అలీగంజ్ సమీపంలో తన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తనకు రక్షణగా ఉన్న పోలీస్ గార్డు సెలవులో ఉన్నాడని, దీన్ని అవకాశంగా తీసుకొని తన ఎస్‌యూవీ వాహనంపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారన్నారు. గత ఏడాది అక్టోబర్ 3 న లఖింపూర్ ఖేరి హింసాత్మక సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తనయుడు ఆశిష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News