Saturday, November 23, 2024

ఆర్యన్ ఖాన్ కేసులో పోలీస్ కస్టడీకి సాక్షి !

- Advertisement -
- Advertisement -

Gosavi
ముంబయి: నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్ కేసులో కీలక సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని మరో చీటింగ్ కేసులో అక్టోబర్ 28న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అతడిని నవంబర్ 8 వరకు పోలీస్ కస్టడీకి పంపారు. ఇదివరకు అతడి పోలీస్ కస్టడీ నవంబర్ 5 వరకే అన్నారు. 2018 నాటి చీటింగ్ కేసులో పుణే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడు సతంత్ర సాక్షి. అతడు మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని చిన్మయి దేశ్‌ముఖ్ అనే వ్యక్తిని మోసగించి రూ. 18 లక్షలు తీసుకుని మోసగించాడన్నది ఆ పాత కేసు. బాధితుడిని బెదిరించినందుకుగాను పోలీసులు గోసవిపై అక్టోబర్ 31న వానోవరీ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. బాధితుడిని బెదిరించినందుకు, కుట్ర సంబంధిత అంశాలపై గోసవిపై ఐపిసి సెక్షన్లు 420, 409, 506(2), 120(బి), ఆయుధాల చట్టం 3(బి) కింద కేసు పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News