Tuesday, March 4, 2025

ఆమె ప్రపంచానికే బామ్మ!.. నేడే తన పుట్టినరోజు!

- Advertisement -
- Advertisement -

ఆమె పేరు మరియా బ్రన్యాస్ మోరీరా. ప్రపంచానికే ఆమె బామ్మ. ఆమె వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం! మరియా వయసు 117 ఏళ్లు. రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన అనుభవం ఆవిడ సొంతం. స్పెయిన్ లోని వెరోనా నగరంలో నివసిస్తున్న మరియా పుట్టినరోజు నేడే. అత్యంత వృద్ధురాలిగా ఆమె గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కింది.

నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని ఊపేసిన కరోనా మహమ్మారి సైతం మరియాను ఏమీ చేయలేకపోయింది. కరోనా బారిన పడినా, తిరిగి కోలుకున్నారు. ఇందుకు ఆమె జీవనశైలి, తీసుకునే ఆహారమే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రశాంతంగా ఉండటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం, దుష్టులు, దుర్మార్గులకు దూరంగా ఉండటం-ఇవే తన జీవిత రహస్యాలని చెబుతున్న ఈ బామ్మగారి కుటుంబంలో చాలామంది 90 ఏళ్లు దాటి బతికారు. ఆవిడకు తొమ్మిదిమంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News