Sunday, December 22, 2024

స్నేహితులతో సెక్స్ చేయాలంటూ భర్త వేధింపులు: పోలీసులకు భార్య ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన స్నేహితులతో లైంగిక సంపర్కం చేయాలంటూ తన భర్త వేధిస్తున్నాడంటూ ఈశాన్య బెంగళూరుకు చెందిన ఒక మహిళ పోఈసులకు ఫిర్యాదు చేశారు. అమృతహల్లి పోలీసు స్టేషన్‌లో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. 2007లో వివాహం చేసుకున్న ఈ జంటకు 11, 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ మహిళ వయసు 42 కాగా ఆమె భర్త వయసు 47 సంవత్సరాలు. పెళ్లయిన తర్వాత కొన్ని సంవత్సరాలు వీరు మంగళూరులో ఉన్నారు. చిన్న చిన్న విషయాలపైన ఆమెతో భర్త గొడవపడేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వీరు కోస్టల్ కర్నాటకలోని వేరే నగరానికి మకాం మార్చారు.  అక్కడ కూడా వీరి మధ్య గొడవలు కొనసాగాయి.

ఒక రోజు తన భర్త ఫోన్‌లో వాట్సాప్ చాట్లు చూస్తుండగా తమ మధ్య ఉన్న శారీరక సంబంధం గురించి తన భర్త అతని మిత్రులతో చాట్ చేసిన విషయం కనిపించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు వేశ్యలతో రేట్ల గురించి తన భర్త సాగించిన సంభాషణల మెసేజ్‌లు కూడా కనిపించాయని ఆమె తెలిపారు. ఇదే విషయాన్ని గురించి తన భర్తను నిలదీశానని, అందుకు అతను తన ఇష్టం వచ్చినట్లు చేస్తానని చెబుతూ తనపై చేయిచేసుకున్నాడని ఆమె తెలిపారు.

తన భర్త వేధింపులు భరించలేక తన పిల్లలతో కలసి బెంగళూరులోని తన పుట్టింటికి వెళ్లిపోయానని ఆమె తెలిపారు. అయితే తన తల్లిదండ్రులు రాజీకుదిర్చి మళ్లీ భర్త దగ్గరకే పంపివేశారని ఆమె చెప్పారు. ఆ తర్వాత తన భర్త తనను. సిలకలలపే తీసుకుని బెంగళూరులోని ఒక ఫ్లాట్‌కు మకాం మార్చాడని ఆమె తెలిపారు. తన భర్త తనతో ఒక్కరోజు కూడా మామూలుగా గడపలేదని, అతని మిత్రులతో లైంగిక సంపర్కం పెట్టుకోవాలంటూ బలవంతం చేయసాగాడని, దానికి తాను నిరాకరించడంతో మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐపిసిలోని 498ఎ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అమృతహల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ చేసిన ఫిర్యాదులో కొన్ని ఆధారాలు ఉన్నాయని, అయితే వీటిని పూర్తిగా ధ్రువీకరించుకోవడానికి దర్యాప్తు చేపట్టామని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News