- Advertisement -
ముంబై : భారత నేవీలో అగ్నివీర్ శిక్షణ పొందుతున్న 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ముంబై లోని ఐఎన్‌ఎస్ హమ్లాలో హాస్టల్ గదిలో తనకు తానే సోమవారం ఉదయం ఉరివేసుకున్నట్టు ముంబై పోలీస్‌లు మంగళవారం వెల్లడించారు. కేరళకు చెందిన ఈ యువతి మలాడ్ లోని పశ్చిమ సబర్బన్ ప్రాంతం మల్వానీ ఏరియాలో ఐఎన్‌ఎస్ హమ్లాలో శిక్షణ పొందుతోంది.
హాస్టల్ రూమ్‌లో ఎలాంటి సూసైడ్‌నోట్ లభించలేదని, వ్యక్తిగత కారణాల వల్లనే ఆత్మహత్యకు తెగించినట్టు తెలుస్తోందని పోలీస్‌లు తెలిపారు. ప్రాథమిక శిక్షణ పూర్తి చేశాక గత 15 రోజులుగా ఆమె ఇక్కడ శిక్షణ పొందుతోంది. పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత నెలలో పంజాబ్ మానసా జిల్లాకు చెందిన అగ్నివీర్ అభ్యర్థి అమృత్‌పాల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
- Advertisement -