Monday, December 23, 2024

దారుణ ఘటన.. ఇద్దరు ఆడపిల్లలకు నిప్పంటించిన తల్లి..

- Advertisement -
- Advertisement -

కన్నే తల్లే అతికిరాతంగా తన ఇద్దరు ఆడపిల్లలకు నిప్పంటించిన దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం కర్ణాటకలోని కొలార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ములభగల్ లోని అంజనాద్రి హిల్స్ ఉంటున్న ఆంధ్రప్రదేశ్ లోని రామసముద్రంకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు ఆడపిల్లలకు నిప్పంటించి అనంతరం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అరుపులు కేకలు విని చుట్టు ప్రక్కలవారు అడ్డుకుని పోలీసులకు సమచారం అందిచారు.

వెంటనే సంఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు ఇద్దరు ఆడపిల్లలను ఆస్పత్రికి తరలించారు. అయితే, మంటల్లో ఒక పాప మృతి చెందగా, ఇంకో పాప తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాప పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణంగా స్తానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News