Saturday, December 21, 2024

పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపై సామూహిక లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీస్‌లు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. ఈ నేపథ్యంలో అతడు, మరో వ్యక్తి కూడా ఆ మహిళపై అత్యాచారం చేశారు. హర్యానా లోని పల్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భర్తపై పోలీస్‌లకు ఫిర్యాదు చేయడానికి జులై 23న ఒక మహిళ హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ ఎస్‌ఐ ఫిర్యాదు తీసుకోడానికి నిరాకరించాడు. ఆమెను సమీపం లోని పొలం వద్దకు సహచర పోలీస్ తీసుకెళ్లి మరి కొందరితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాధితురాలిని పల్వాల్ లోని శాంతి అనే మరో మహిళ ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో బాధితురాలిని మూడు రోజుల పాటు నిర్బంధించి ఆ తర్వాత బిజేంద్ర అనే వ్యక్తికి ఆమెను విక్రయించారు. అతడు తన బావ గజేంద్రతో కలిసి ఎస్‌ఐ సమక్షం లోనే ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. అయితే నిందితుల్లో ఒకరి మొబైల్ ఫోన్ నుంచి బాధితురాలు రహస్యంగా పోలీస్‌లకు ఫోన్ చేసి తనను కాపాడాలని వేడుకుంది. దీంతో పోలీస్‌లు రంగం లోకి ఎస్‌ఐ శివచరణ్‌తో సహా ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News