Saturday, December 28, 2024

ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం

- Advertisement -
- Advertisement -

లింగంపేట్ : లింగంపేట్ మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన వి వాహిత పిల్లలతో అదృశ్యం అయినట్లు ఫి ర్యాదు నమోదు అయినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాణాపూర్ గ్రామానికి చెందిన డప్పు సాయిలుకు బిక్కనూర్ మండలం జం గంపల్లి గ్రామానికి చెందిన నవనీతకు 20 14 వివాహం జరిగింది. సంవత్సరం తరువాత దంపతులిద్దరు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు.

Also Read: బాసరలో ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యా యత్నం

అక్కడే పను లు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఇద్దరి మద్య మనస్పర్థాలు ఏర్పడి గొడవలు జరిగేవని దీంతో భర్తకు చెప్పకుండా నవనీత పుట్టింటికి వచ్చేసింది. అక్కడి నుంచి గత నెల 14 న ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. భర్త వద్దకు చేరకపోవడంతో బంధువులు, గ్రామంలో వెతికినా ఆచూకి అభించకపోవడంతో తండ్రి లింగంపేట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసారు. అతని ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News