Sunday, December 22, 2024

వ్యభిచారం చేయాలని బాలికపై ఒత్తిడి చేసిన మహిళ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బాలికతో వ్యభిచారం చేయిస్తున్న మహిళను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…జూబ్లీహిల్స్‌కు చెందిన పి.లక్ష్మి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో తన ఇంట్లోనే మరో మహిళలతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తోంది. బాలికను లక్ష్మి పెంచుకుంటోంది. పాఠశాలకు వెళ్తున్న బాలిక చదువు ఆపివేసి వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తోంది. దీనికి బాలిక నిరాకరించడంతో స్టిక్‌తో కొట్టడం, కాల్చడం చేస్తోంది. అంతేకాకుండా బాలిక వెంట్రుకలను కట్ చేసింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో దాడి చేసి బాలికకు విముక్తి కల్పించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ జంగయ్య, అరవింద్, నవీన్ కలిసి దాడి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News