Monday, April 14, 2025

కిలాడీ లేడీ అరాచకాలు

- Advertisement -
- Advertisement -

పాఠశాలకు వెళ్లే బాలికల కిడ్నాప్ డ్రగ్స్
ఇచ్చి.. వారిపై యువకుల గ్యాంగ్‌తో
అత్యాచారం ఓ బాలిక మిస్సింగ్ కేసుతో
బయటికొచ్చిన నిజాలు ఏడాది కాలంగా
కొనసాగుతున్న ఘాతుకం వరంగల్ పోలీసుల
అదుపులో మాయలేడీ

పాఠశాలలకు వెళ్లే మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి, వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
చేయిస్తున్న ఒక కిలాడీ లేడీని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ ఘోరాలు బయటపడ్డాయి. హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కిలాడీ లేడీ వరంగల్, మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటూ ఈ దురాగతాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏడాది కాలంగా ఈ అక్రమాలు కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పాఠశాలలకు వెళ్లే మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి, వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయిస్తున్న ఒక కిలాడీ లేడీని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ ఘోరాలు బయటపడ్డాయి. హనుమకొండ జిల్లా, దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ వరంగల్, మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆమె తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటుపడిన ఓ యువతి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా మారి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతోంది. పాఠశాల బాలికలే లక్ష్యంగా ఈ కిలాడీ లేడీ వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తోంది. బాలికలు పాఠశాలకు వెళ్లి వచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. వారితో చనువు పెంచుకుని, కలివిడిగా ఉన్నట్టు నటించి బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన గ్యాంగ్‌కు టచ్ లో ఉన్న మానవ మృగాలకు వారిని అప్పగిస్తోంది. కిలాడీ లేడీకి డబ్బు ఇచ్చే మానవమృగాలు, బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్లిపోతారు.

ఏడాది కాలంగా….
ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక తనను మళ్లీ వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలినట్లు సమాచారం తెలిసింది. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్ల్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ఆ కిలాడీ లేడీని మిల్స్ కాలనీ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్ల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News