- Advertisement -
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న మహిళను వెస్ట్‌జోన్, సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని గోషామహల్‌కు చెందిన శ్రీదేవి అలియాస్ బైరాధ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేస్తోంది. దానిని అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తోంది. కిషన్‌బాగ్ బస్తీ, జన్సీచౌరారోడ్డు, సంతోషీమాతా టెంపుల్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు దాడి చేసి నిందితురాలిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ బిక్షపతి, హెచ్‌సి ఖాజావహీదుద్దిన్, మధుసూదన్, పిసిలు రవీందర్, ప్రవీణ్, విజయ్‌రాజ్ తదితరులు పట్టుకున్నారు.
- Advertisement -