Friday, November 15, 2024

చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Woman arrested for theft in hyderabad
చిన్నపిల్లల బంగారు ఆభరణాలే టార్గెట్

హైదరాబాద్: చిన్న పిల్లలకు మాయమాటలు చెప్పి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న నిందితురాలిని ఉప్పల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి నాలుగు గ్రాముల బంగారు కమ్మలు, 200 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని కడప జిల్లా, ఎర్రముక్కపల్లి కాలనీకి చెందిన వేగ్నం అనురాధ కూలీ పనిచేస్తుంది. బతుకు దెరువు కోసం కూతురితో కలిసి నగరానికి వచ్చి నందిహిల్స్ రోడ్డు నంబర్ 6, మీర్‌పేటలో ఉంటోంది. ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్‌గా చేరింది. వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో చిన్న పిల్లలు ఒంటిరిగా ఉన్నది చూసి వారికి బొమ్మలు, చాక్లెట్లు ఇప్పిస్తామని చెప్పి నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేస్తోంది.

జూన్ 17వ తేదీ రామంతపూర్‌లోని బాలకృష్ణనగర్‌లో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక(9 ఏళ్లు)ను అనురాధ తన వెంట వస్తే డబ్బులు, బొమ్మలు ఇస్తాను అని ఆశచూపింది. చుట్టుపక్కల తిప్పి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకుని వెళ్లి బంగారు చెవి కమ్మలు, వెండి పట్టీలు తీసుకుని పారిపోయింది. జూలై 24వ తేదీ వనస్థలిపురంలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్లు ఇస్తాను అని ఆశ చూపి తన వెంట తిప్పుకుని జత బంగారు చెవి కమ్మలు, జత వెండి పట్టిలు తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. నిందితురాలు గతంలో 2015 నుంచి 2019 వరకు రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 నేరాలు చేసింది. గతంలో పోలీసులు అరెస్టు చేయడంతో జైలుకు వెళ్లింది, బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్లు గోవింద్ రెడ్డి, నర్సింగరావు, ఎస్సై పోచయ్య దర్యాప్తు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News