Sunday, January 12, 2025

బెంగళూరులో యువతిపై కారులో సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కోరమంగళ వద్ద ఒక 19 ఏళ్ల యువతిని కారులో అపహరించిన నలుగురు వ్యక్తులు మూడు గంటలకు పైగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం మే 25వ తేదీ రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్(ఎన్‌జివి) వద్ద పార్కులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కూర్చుని ఉంది. నిందితులలో ఒకడు ఆ జంట సిగరెట్ తాగడాన్ని చూశాడు. ఆ జంట వద్దకు వెళ్లి వారిని ప్రశ్నించసాగాడు. అతడితో వాగ్వాదానికి ఆ జంట నీ పనేంటో నువ్వు చూస్కో మని చెప్పింది.

దీంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత ఆ యువతి బాయ్‌ఫ్రెండ్ సమీపంలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. యువతి ఒంటరిగా ఉండడం చూసిన మొదటి నిందితుడు తన ఇద్దరు స్నేహితులతో మళ్లీ పార్కులోకి వచ్చాడు. ఆ ముగ్గురూ కలసి ఆ యువతి వద్దకు వెళ్లి ఆమెతో అసభ్యంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఇంతలో మరో వ్యక్తి కారులో అక్కడకు చేరుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఆ యువతిని కారులోకి బలవంతంగా ఎక్కించి హోసూరు రోడ్డు, నైస్ రోడ్డు వైపు తీసుకెళ్లారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం నడుస్తున్న కారులోనే ఆ నలుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆమెను రోడ్డు పక్కన వదిలేసి వాళ్లు కారులో ఎలిపురా వైసు వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు తన తల్లి, స్నేహితుల సాయంతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి గాయాలకు చికిత్స చేయించుకుంద.ఇ తర్వాత కోరమంగళ పోలీసు స్టేషన్‌లో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురిపై ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందిన వెంటనే రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 9 గంటల్లోనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని డిసిపి(సౌత్ ఈస్ట్) సికె బాబా తెలిపారు. నిందితులను సతీష్, విజయ్, శ్రీధర్, కిరణ్‌గా పోలీసులు గుర్తించారు. 22 నుంచి 26 మధ్య వయస్కులైన వీరంతా ఎజిపురా, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నారని, వీరంతా వేర్వేరు ప్రైవేట్ కంపెనీలలో ఆఫీస్ బాయ్‌లుగా, ఇతర ఉద్యోగాలు చేస్తున్నారని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News