Sunday, December 22, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులపై దాడి

- Advertisement -
- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళలు పోలీసులపై దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ రోడ్డు నంబర్2లో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకోగా,ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్, రోడ్డు నంబర్2లోని పార్క్‌హయత్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ మహిళ కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా ఆపారు. కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళను హోంగార్డు టెస్ట్ చేసేందుకు యత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఆమెతోపాటు కారులో ఉన్న ముగ్గురు మహిళలు ఒక్కసారిగా హోంగార్డును భూతులు తిడుతూ విరుచుకుపడ్డారు.

అంతటితో ఆగకుండా హోంగార్డ్ ఫోన్ తీసుకొని కారు నడుపుతున్న మహిళ నేలకేసి కొట్టింది. ఇది గమనించిన ఎస్సై అవినాష్ అక్కడికి వచ్చి మహిళలను ప్రశించగా అతడిపై దాడి చేశారు. పోలీసుల వద్ద ఉన్న కెమెరాలను ధ్వంసం చేశారు. మహిళలకు మద్దతుగా ఇద్దరు యువకులు వచ్చి గొడవ చేయడంతో వారిని పట్టుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. హోంగార్డు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News