Tuesday, January 21, 2025

భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై దాడి చేసిన భార్య

- Advertisement -
- Advertisement -

తన భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై దాడి చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మధురానగర్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసేందుకు వైన్స్ షాపుకు వెళ్లాడు. అక్కడ పేమెంట్ విషయంలో వైన్స్‌లో పనిచేసే సిబ్బందికి మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వైన్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది సదరు వ్యక్తిపై దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. గాయాలతో ఇంటికి వెళ్లిన భర్తను చూసిన మహిళ ఆగ్రహంతో వైన్స్ షాపుకు వెళ్లి అక్కడి సిబ్బందిపై దాడి చేసింది. అంతేకాకుండా మందుబాటిళ్లను ధ్వంసం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వైన్స్ సిబ్బంది, మహిళపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News