Wednesday, January 22, 2025

ఏలూరులో దారుణం: బైక్ వచ్చి మహిళపై యాసిడ్‌తో దాడి

- Advertisement -
- Advertisement -

ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పట్టణంలో మంగళవారం రాత్రి మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళపై యాసిడ్ విసరి పరారయ్యారు. పట్టణ శివార్లలోని బాధితురాలు యడ్ల ప్రచారిక ఇంటి సమీపంలో ఈ సంఘటన జరిగింది.

ఆమె ఇంటికి తిరిగివస్తుండగా బైక్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ విసిరి పరారైనట్లు ఏలూరు ఎస్‌పి డి మేరీ ప్రశాంతి బుధవారం తెలిపారు. వెంటనే బాధితురాలి ఇంటికి చేరుకోగా ఆమె తల్లిదండ్రులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందచేసినట్లు ఎస్‌పి తెలిపారు.

బాధితురాలి మొహంపై యాసిడ్ పడడంతో ఆమె కళ్లు దెబ్బతిన్నాయని ఎస్‌పి చెప్పారు. స్థానిక డాక్టర్ల సూచనతో వెంటనే ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌పి చెప్పారు. బాధితురాలి ఎడమ కన్నుకు ఎటువంటి ప్రమాదం లేదని, కాని కుడి కన్ను 60 శాతం దెబ్బతినడంతో సర్జరీ అవసరమవుతుందని ఆమె తెలిపారు. శరీరంలోని ఇతర భాగాలకు పెద్దగా నష్టం జరగలేదని ఆమె తెలిపారు. మెరుగైన వైద్య అందచేయడానికి బాధితురాలిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మార్చాలని యోచిస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు.

ఇదిలా ఉండగా..యాసిడ్ దాడికి పాల్పడి పరారీలో ఉన్న నిందితుల కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఎస్‌పి చెప్పారు. బాధితురాలు కాని, ఆమె తల్లిదండ్రులు కాని అనుమానితులను గుర్తించే పరిస్థితిలో లేరని, ఆ ప్రాంతంలో సిసి టివి కెమెరాలు కూడా అందుబాటులో లేవని ఎస్‌పి తెలిపారు. దిశ చట్టంతోపాటు ఐపిసిలోని 307, 326ఎ, 34 సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News