Sunday, December 29, 2024

అత్తింటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం ఉదయం అర్ధగంటసేపు పాటు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన ఫాతిమాకు కొత్తగూడెం చెందిన అజ్మత్‌తో పదేళ్ల కిందట వివాహం జరగగా, నెల రోజుల కిందట కుటుంబ మనస్పర్థల కారణంగా దమ్మపేటలోని పుట్టింటికి వచ్చింది. గత నెల రోజులుగా భార్య ఫాతిమా తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో అత్తింటివారిపై ఫిర్యాదు చేసింది. అయినా పోలీస్‌లు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట దమ్మపేట=పాల్వంచ ప్రధాన రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించింది. ఈ క్రమంలో ఆమె తల్లి మైబు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా అక్కడే ఉన్న మహిళా పోలీస్‌లు వెంటనే తేరుకొని బాధిత ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు.

పోలీస్‌లు బాధిత కుటుంబాన్ని సముదాయించే ప్రయత్నం చేసినా చాలాసేపటి వరకు బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై కూర్చొని రోదిస్తూ ధర్నా చేస్తూనే ఉన్నారు. ఈ వివాదంలో కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు ఒత్తిడి కారణంగానే పోలీస్‌లు పట్టించుకోవటం లేదని, రౌడీషీటర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ సాయి కిషోర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి రాస్తారోకో విరమించాలని, వెంటనే అత్తింటి వారిపై కేసు నమోదు చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా బాధిత కుటుంబ సభ్యులు పెట్రోల్ తో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News