Wednesday, January 22, 2025

వేధింపులు తాళలేక కొడుకుతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -
Woman attempts suicide with son after harassment
చిన్నారి మృతి.. మహిళ పరిస్థితి విషమం

సికింద్రాబాద్: భర్త వేధింపులు భరించలేక ఓ గృహిణి తన కుమారునితో కలిసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ మెట్టుగూడలో నివాసముంటున్న గృహిణి తప్పెట దివ్య తేజ (32) తప్పెట మహేందర్ వివాహం 06092018లో జరిగింది. వీరికి రిత్విక్ (01) కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయంలో నాలుగు లక్షల నగదు, 10 తులాల బం గారం కట్నంగా అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా మెట్టుగూడలో నివాసముంటున్నారు. కాగా దివ్య తేజ భర్త పెళ్లి నాటి నుండి అదనపు కట్నం కో సం వేధించడం మొదలు పెట్టారు.

పెళ్లి సమయంలో తాను సిఎనని నమ్మబలికి పెళ్లి చేసుకొని పనిపాట లేకుండా భార్యను నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. మానసికంగా , శారీరకంగా వేధింపులకు గురిచేస్తుండటంతో భర్త వేధింపులు భరించలేక తన వద్ద ఉన్న బంగారాన్ని సఫిల్‌గూడలోని తన తల్లిదండ్రులు ఇం ట్లో పెట్టి తిరిగి తన ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో భర్త ఇరుగుపొరుగు వారితో గొడవ పడుతుండటంతో వారించడానికి వెళ్లింది. అయితే అక్కడ పరస్పరం గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన ఆమె తన కుమారు ని మణికట్టు, గొంతును కోసి అనంతరం తన చేతి మణికట్టు, గొంతును కోసుకొని, శానిటైజర్‌ను సేవించి నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూ కి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News