Monday, December 23, 2024

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస.. చోరీలు చేస్తున్న మహిళ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో గేమ్స్‌కు బానిసగా మారి చోరీలు చేస్తున్న మహిళను ఉప్పల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మహిళ వద్ద నుంచి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఉప్పల్‌కు చెందిన నిర్మల అనే మహిళ మొబైల్‌లో ఆన్‌లైన్‌లో గేమ్స్‌కు బానిసగా మారింది. కొన్ని గేమ్స్ ఆన్‌లైన్‌లో ఆడాలంటే డబ్బులు కావాల్సి ఉంటుంది. వాటి కోసం నిర్మల తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించింది.

ఈ క్రమంలోనే ఆర్‌టిసి రిటైర్డ్ ఉద్యోగి కర్నాకర్ రెడ్డి పది రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు కన్పించలేదు. దీంతో ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఇంటి పక్కన ఉంటున్న నిర్మలకు కర్నాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు తాళం చెవి డోర్ దగ్గర పెట్టే విషయం తెలుసు. దానిని అనుకూలంగా మల్చుకున్న నిర్మల తాళం చెవి తీసుకుని ఇంట్లోకి వెళ్లి చోరీ చేసింది. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News