Sunday, January 19, 2025

కర్నూల్‌లో భర్త నాలుక కొరికిన భార్య… తీవ్ర రక్తస్రావం

- Advertisement -
- Advertisement -

అమరావతి: మద్యం సేవించిన మైకంలో భార్యకు భర్త ముద్దు పెట్టాలనుకున్నాడు. భార్య నోట్లో బలవంతంగా ముద్దు పెడుతుండగా అతడి నాలుకను ఆమె కొరకడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎల్లమ్మ గుట్ట తండాలో చందు నాయక్, పుష్పవతి అనే దంపతులు నివసిస్తున్నారు. చందు నాయక్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్యకు ముద్దు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. లిప్ లాక్ కిస్ ఇవ్వాలని భార్యను బలవంతం చేశాడు. లిప్ లాక్ కిస్ వద్దన వ్యతిరేకించిన అతడు మాత్రం వినలేదు. భార్యను లిఫ్‌లాక్ కిస్ ఇవ్వడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చి అతడి నాలుకను గట్టిగా కొరికింది. నాలుక నుంచి రక్త కారడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. నాలుక సగభాగం వరకు కట్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News