మనతెలంగాణ, హైదరాబాద్ : ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో వలపు వల విసిరింది ఓ మాయ లేడీ. దానిని అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడంతో తట్టుకోలేక నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన అబ్దుల్ కరీం అనే వ్యక్తికి ఫేస్బుక్లో గుర్తుతెలియని మహిళ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపింది. దీనిని బాధితుడు అంగీకరించడంతో కొద్ది రోజుల తర్వాత ఛాటింగ్ చేసి ముగ్గులోకి లాగింది. తర్వాత కరీంను న్యూడ్‌గా ఉండి వీడియో కాల్స్ మాట్లాడేలా చేసింది. వాటిని నిందితురాలు రికార్డు చేసింది. న్యూడ్ వీడియోలను బాధితుడికి పంపించి బ్లాక్‌మేయిల్ చేయడం ప్రారంభించింది. డబ్బు ఇవ్వకపోతే న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించింది. న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెడితే పరువు పోతుందని భావించి కరీం మొదటి సారి రూ.1.50లక్షలు పంపించాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ రూ.2లక్షలు పంపించాల్సిందిగా డిమాండ్ చేసింది. డబ్బుల కోసం మహిళ పెడుతున్న బాధలు భరించలేక హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.