Sunday, December 22, 2024

బిజెపి నేత ఇంటి పెరట్లో మహిళ శవం

- Advertisement -
- Advertisement -

పుణె: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బిజెపి మాజీ ఎంఎల్‌సి బంగళా వెనుక సగం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహం లభించింది. బిజెపి మాజీ ఎంఎల్‌సి కాంత నలవాదె కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటి ఆవరణను శుభ్రం చేస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

ఆ బంగళాను బిజెపి నేత కుటుంబం అప్పుడప్పుడు వాడుతుందని పోలీసులు చెప్పారు. నలవాదె కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. మృతురాలిని ఇంకా గుర్తించవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News