Saturday, April 5, 2025

కామారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

రామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన రామారెడ్డి మండలం అన్నారంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే నర్సవ్వను మహిళను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. హత్య అనంతరం నగలు దోచుకెళ్లి, మృతదేహాన్ని చెరువులో పడేశారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితలు కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News