Monday, January 20, 2025

పట్టపగలే మహిళ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మహిళ దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డుపై బైక్‌పై వచ్చిన వక్తులు అందరు చూస్తుండగానే మహిళనూ కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారి భయబ్రాంతులకు గురయ్యారు. కొంత సేపు అక్కడ ఏమి జరిగిందని సంఘటన నుండి తోరుకోలేకపోయారు. మున్సిపల్ కార్యాలయం ముందే ఈ సంఘటన చోట చేసుకోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. రాజీవ్‌నగర్‌కు చెందిన జంగాల స్వప్న అనే మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు తెలుపుతున్నారు.

Also Read: లంచం తీసుకుంటూ దొరికిన ఫీవర్ ఆస్పత్రి హెల్త్ ఇన్స్పెక్టర్

స్వప్నకు ఇది వరకే మూడు వివాహాలు జరిగాయి. రెండో భర్త హత్య చేసినట్లు ప్రాథమికంగా సమాచారం. మహళను పట్టగలు బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతికిరాతంగా హత్య చేసి బైక్‌పై పారిపోవడం సంచలనం సృష్టించింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ హత్యను పోలీసులు సవాల్‌గా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్యకు దారి తీసిన సంఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల సిఐ రాజు కొని స్థానికులను హత్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News