Sunday, January 19, 2025

ఆస్తి కోసం మహిళ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుమురం భీం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తి మహిళను దారుణంగా హత్య చేశాడు. జిల్లాలోని బెజ్జూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు పెద్దమ్మను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆస్తి తగాదాలతో గట్టు చంద్రకళ ను నిందితుడు చంపినట్లు తెలిపారు. అనంతరం పోలీసుల ముందు నిందితుడు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహంను పోస్ట్ మార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News