Sunday, January 19, 2025

విషాద ఘటన: బస్సులో మంటలు చెలరేగి మహిళ సజీవదహనం..

- Advertisement -
- Advertisement -

బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగి ఓ మహిళ సజీవదహమైంది. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా మాధబ్ పూర్ వద్ద రన్నింగ్ లో ఉన్న ఓ ప్రైవేటు బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మంటల్లో చిక్కుకుని కాలిపోయింది.

ఈ ప్రమాదంలో మరో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు.. కోల్ కతా బాబూఘాట్ నుంచి ఒడిశా పారాదీప్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News